: ఇతరుల ఆలోచనలకు తగ్గట్టు నన్ను నేను మార్చుకోను: అనుష్కశర్మ


ఇతరుల ఆలోచనలకు తగ్గట్టు తనను తాను మార్చుకోబోనని బాలీవుడ్ నటి అనుష్కశర్మ అంటోంది. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. త‌న గురించి ప‌లు విష‌యాలు తెలిపింది. తాను ట్రెండ్ కూడా ఫాలో అవ్వనని పేర్కొంది. త‌న‌కు మంచి గుర్తింపు తెచ్చే పాత్రలను ఎంచుకుంటాన‌ని చెప్పింది. వాటి మీదనే ఫోకస్ చేస్తాన‌ని, తాను త‌న‌ మనసు చెప్పిందే వింటాన‌ని తెలిపింది. త‌న మ‌న‌సుకి ఏది స‌రైంద‌ని అనిపిస్తుందో అది మాత్రమే చేస్తానని చెప్పింది. 'రబ్‌ నే బనాదీ జోడీ' సినిమాలో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ త‌న అందం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షిస్తోంది. ఆమె చేతిలో ప్ర‌స్తుతం మ‌రో మూడు సినిమాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News