: 52 రోజుల వ్యవధిలో ఒకేలా మృతి చెందిన అక్కాచెల్లెళ్లు.. లైంగిక దాడులే కారణం!
కేరళలోని పాలక్కడ్ జిల్లాలో 52 రోజుల క్రితం 14 ఏళ్ల ఓ బాలిక ఉరివేసుకొని మృతి చెందింది. అయితే, ఆ బాలిక చెల్లి కూడా నాలుగు రోజుల క్రితం అదే విధంగా ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించడం కలకలం రేపుతోంది. వారిద్దరు చనిపోవడానికి ముందు లైంగిక దాడులకు గురయ్యారని పోలీసులు తేల్చారు.
వివరాల్లోకి వెళితే... కూలి పనులకు వెళ్లిన తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చేసరికి తమ తొమ్మిదేళ్ల పాప ఇంట్లో ఫ్యానుకి వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనపై వారు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆమె లైంగిక దాడికి గురైనట్లు తెలుసుకున్నారు.
తమ పెద్దకూతురిపై తమ బంధువైన ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడని, దీంతో అప్పటి నుంచి అతడిని తమ ఇంటికి రానివ్వడం లేదని వారి తల్లి పేర్కొంది. అయితే, తమ పెద్ద కూతురు మృతిచెందిన రోజు ఇద్దరు వ్యక్తులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం చూసినట్లు చిన్న కుమార్తె తనతో చెప్పిందని ఆమె తెలిపింది. ఆ ఇద్దరు బాలికలది ఆత్మహత్యా? లేక హత్యా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.