: ఇప్పుడే బాహుబలి 2 ట్రైలర్ చూశా.. నా గుండె అదిరిపోయింది: మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణ రమణ


దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న బాహుబలి 2 సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంత‌గా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. త్వ‌ర‌లోనే ఈ మూవీ ట్రైల‌ర్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చిత్ర యూనిట్ భావిస్తుండ‌గా ఈ ట్రైల‌ర్‌ను పలువురు సినీ ప్రముఖులు ఇప్ప‌టికే చూశారు. ఈ ట్రైలర్ దాదాపుగా రెండున్నర నిమిషాల పాటు ఉండనుందని తెలుస్తోంది.

ఈ మూవీ ట్రైలర్‌ను చూసిన మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణరమణ (కల్యాణి మాలిక్) త‌న ఫేస్ బుక్ ఖాతా ద్వారా స్పందిస్తూ... ఇప్పుడే బాహుబలి 2 ట్రైలర్ చూశానని అన్నారు. త‌న‌ గుండె అదిరిపోయింద‌ని పేర్కొన్నారు. సినిమాతో సంబంధం లేకుండా ఇది కూడా విడిగా 100 రోజులు అడుతుందని, రికార్డులు బద్ద‌లు కొడుతుందని ఆయ‌న అన్నారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుందని చెప్పారు. ఈ ట్వీట్‌కు ప్రేక్ష‌కుల‌ నుంచి భారీ స్పంద‌న వ‌స్తోంది. కల్యాణరమణ ఈ మూవీకి సౌండ్ సూపర్‌వైజర్‌గా ప‌నిచేస్తున్నారు.

  • Loading...

More Telugu News