: ఎయిర్ టెల్ హోలీ కానుక... రూ. 150తో రోజుకు 1 జీబీ


రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ తరువాత, పోటీలో నిలిచి కస్టమర్లను కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతున్న టెలికం సంస్థలు భారీ ఎత్తున ఆఫర్లను ప్రకటిస్తున్న వేళ, హోలీ పర్వదినం సందర్భంగా ఎయిర్ టెల్ మరో ఆకర్షణీయమైన ఆఫర్ ను ప్రకటించింది. పోస్టు పెయిడ్ కస్టమర్ల కోసం, 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 150కి రోజుకు ఒక గిగాబైట్ డేటాను ఇస్తామని చెప్పింది. ఈ ఆఫర్ లో భాగంగా పగలు 500 ఎంబీ, రాత్రి 500 ఎంబీ (అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకూ)ని అందిస్తామని తెలిపింది.

కాగా, ప్రీపెయిడ్ కస్టమర్లకు ఇదే తరహా ఆఫర్ ను ఎయిర్ టెల్ రూ. 345 నెలవారీ ప్లాన్ పై సంస్థ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎయిర్ టెల్ తాజా రూ. 150 ఆఫర్ పై భారతీ ఎయిర్ టెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోపాల్ విట్టల్, పోస్టు పెయిడ్ కస్టమర్లకు ఈ-మెయిల్ లేఖ ద్వారా తెలిపారు. కాగా, పోటీలో నిలిచేందుకు మిగతా టెల్కోలైన వోడాఫోన్, ఐడియా వంటి సంస్థలు ఇదే తరహాలో రోజుకు 1 జీబీ ఇచ్చే ప్యాక్ లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News