: టీమిండియా కోచ్ ను కలిసిన అక్కినేని అఖిల్!


భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ ను టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ కలిశాడు. వివరాల్లోకి వెళ్తే, బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమానికి అఖిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇదే కార్యక్రమానికి శ్రీధర్ కూడా వచ్చాడు. అఖిల్ కు క్రికెట్ అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలో కూడా అఖిల్ కోచింగ్ తీసుకున్నాడు. అనుకోకుండా శ్రీధర్ కనిపించేసరికి అఖిల్ చాలా ఆనందానికి గురయ్యాడు. అతనితో కలసి ఫోటో దిగాడు. తాను శ్రీధర్ ను కలిసినట్టు ట్వీట్ చేశాడు. మరోవైపు అఖిల్ తనను కలిసిన విషయాన్ని శ్రీధర్ కూడా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి ఫొటో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.  

  • Loading...

More Telugu News