: తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిన జగన్
దివాకర్ ట్రావెల్స్ బస్సు కృష్ణా జిల్లా నందిగామ వద్ద పెను ప్రమాదానికి గురై 11 మంది ప్రాణాలను తీసిన వేళ, ఆసుపత్రిలో జరిగిన ఘటనల తరువాత తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టి వేయాలని తెలుగు రాష్ట్రాల హైకోర్టును జగన్ ఆశ్రయించారు. ఈ మేరకు కేసును కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆసుపత్రిలో తమను జగన్ దుర్భాషలాడాడని, తమ విధులకు ఆటంకం కలిగించారని డాక్టర్లు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నందిగామ పోలీసులు కేసు నమోదు చేసి, జగన్ పై పలు సెక్షన్ల కింద అభియోగాలను మోపారు. కాగా, జగన్ తాజా పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.