: దాని ధర కేవలం రూపాయే... అయినా 300 కోట్లు కొల్లగొట్టింది!
పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఆశ్చర్యపోయేలా ఓ చిన్న క్యాండీ మార్కెట్లో దూసుకుపోతోంది. దాని పేరే 'పల్స్'. పచ్చి మామిడి, జామ రుచితో ఈ పల్స్ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇందులో పచ్చి మామిడి క్యాండీ రుచి వినియోగదారులను తెగ ఆకట్టుకుంది. డీఎస్ గ్రూప్ 2015లో దీన్ని లాంచ్ చేసింది. ఈ క్యాండీ ధర కేవలం రూపాయి మాత్రమే. అయినా గత రెండేళ్ల కాలంలో రూ. 300 కోట్ల అమ్మకాలను నమోదు చేసింది. బహుళజాతి కంపెనీలు కూడా సాధించలేని విధంగా పల్స్ అమ్మకాలు ఉన్నాయి.
2011లో ప్రారంభమైన 'ఓరియో' బిస్కెట్ల అమ్మకాలు కేవలం రూ. 283 కోట్లు మాత్రమే. మార్స్ బార్స్ అమ్మకాలు రూ. 270 కోట్లే. వీటన్నింటినీ పల్స్ అధిగమించి మల్టీ నేషనల్ కంపెనీలకు సవాల్ విసురుతోంది. సింగపూర్, అమెరికా, యూకేలో కూడా పల్స్ ను విక్రయించడం ప్రారంభించామని డీఎస్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శశాంక్ సురాన చెప్పారు.