: ఉ.కొరియా విషయంలో అమెరికాను తీవ్రంగా హెచ్చరించిన చైనా!


అణు పరీక్షలు, క్షిపణి ప్రయోగాలతో దుస్సాహ‌సానికి పాల్ప‌డుతున్న ఉత్తర కొరియా చ‌ర్య‌ల ప‌ట్ల తీవ్రంగా స్పందిస్తోన్న అమెరికా దక్షిణ కొరియాలో క్షిపణి రక్షక వ్యవస్థను మోహ‌రిస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ విష‌యంపై చైనా అమెరికాను హెచ్చ‌రించింది. ఆ క్షిపణి వ్యవస్థకు వ్యతిరేకంగా త‌మ దేశం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పింది. దాని వ‌ల్ల క‌లిగే పరిణామాలను అమెరికా, దక్షిణ కొరియా ఎదుర్కోక తప్పదని తెలిపింది. ద‌క్షిణ కొరియాలో అమెరికా చేస్తోన్న ఆ ప్ర‌య‌త్నాల‌ను త‌మ దేశం వ్య‌తిరేకిస్తోంద‌ని చెప్పింది. క్షిపణి రక్షక వ్యవస్థ ఏర్పాటు కోసం ఇప్పటికే అమెరికా మిస్సైల్‌ లాంచర్లు, ఇతర సామగ్రి దక్షిణ కొరియా చేరుకున్నాయి.

  • Loading...

More Telugu News