: నిందితుడి మరణంతో.. చెన్నై టెక్కీ స్వాతి హత్య కేసును క్లోజ్ చేసిన కోర్టు!


గత సంవత్సరం జూన్ 24న చెన్నైలోని నుంగంబాక్కం రైల్వే స్టేషన్ లో హత్యకు గురైన ఐటీ ఉద్యోగిని స్వాతి హత్య కేసు విచారణను ముగిస్తున్నట్టు ప్రకటిస్తూ, కేసును కొట్టి వేస్తున్నట్టు ఎగ్మోర్ కోర్టు తీర్పిచ్చింది. ప్రయాణికులంతా చూస్తుండగా, స్వాతిని రామ్ కుమార్ అనే యువకుడు దారుణంగా హత్య చేసి పారిపోయిన సంగతి తెలిసిందే. సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా, రామ్ కుమార్ ను గుర్తించి, ఆపై తన స్వగ్రామంలో దాగున్న అతడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపగా, సెప్టెంబర్ 18న అతను జైల్లోని విద్యుత్ తీగలను నోటితో కొరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు హత్య చేసిన నిందితుడు చనిపోయాడని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో, ఈ కేసును ముగిస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.

  • Loading...

More Telugu News