: అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కన్నడ సింగర్ సుహానా


కర్ణాటకలోని షిమోగాలో జరిగిన ఓ కార్యక్రమంలో హిందూ భక్తిగీతం పాడి ఎంతో మంది మన్ననలను అందుకున్న సింగర్, సుహానా సయీద్, ముస్లిం అతివాదుల నుంచి వస్తున్న బెదిరింపులకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఆమె పాడిన పాటకు, సుహానా స్వర మాధుర్యానికి ఎంతో మంది ముగ్ధులై, హిందూ, ముస్లిం సమైక్యతకు వారధిగా నిలిచిందని ప్రశంసించగా, కొందరు మాత్రం ముస్లింల ప్రతిష్ఠను మంటగలిపావంటూ మండిపడ్డారు.

మంగళూరు ముస్లింస్ అనే ఫేస్ బుక్ పేజీ ఆమెపై విమర్శలతో నిండిపోయింది. సుహానా అందాన్ని ఇతరులకు చూపించేలా ఆమె తల్లిదండ్రులు ప్రోత్సహించారని, వారు నరకానికే వెళతారని, పెద్ద విజయం సాధించానని భావించొద్దని, మగవాళ్ల ముందు నిలబడి పాటడం ఏంటని విరుచుకుపడ్డారు. సొంత వర్గం నుంచి వస్తున్న బెదిరింపులకు ఆందోళన చెందిన ఆమె, ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేదు.

  • Loading...

More Telugu News