: 'సన్నీలియాన్'ను ఉటంకిస్తూ మహిళా దినోత్సవంపై రాంగోపాల్ వర్మ ట్వీట్ కలకలం!


మహిళా దినోత్సవం రోజున వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ తీవ్ర కలకలం రేపుతోంది. సన్నీలియాన్ ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో, మహిళలంతా అంతే సంతోషాన్ని కలిగించాలని ఆయన చేసిన ట్వీట్ పై విమర్శల వర్షం కురుస్తోంది. దేశమంతా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ, ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాద్వారా రాంగోపాల్ వర్మ స్పందిస్తూ, "ప్రపంచంలోని ఆడవాళ్లంతా, మగవారికి సన్నీలియాన్ ఇచ్చినటువంటి సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా" అని అన్నారు. ఆడవాళ్ల కోసం మగవాళ్లు ఏం చేస్తారో తనకు తెలియదని, కానీ సంవత్సరంలో ఒకరోజు మాత్రం మహిళాదినోత్సవం పేరిట సంబరాలు చేస్తారని అంతకుముందు పెట్టిన ట్వీట్ లో వ్యాఖ్యానించాడు. పురుషులందరి తరఫునా మహిళలకు శుభాకాంక్షలు చెబుతున్నానని, ఏదో ఒకరోజు పురుషులకూ స్వాతంత్ర్యం లభిస్తుందని, 'మెన్స్ డే' జరుపుకునే రోజు వస్తుందని అన్నాడు.

  • Loading...

More Telugu News