: బాహుబలిని ఎందుకు చంపానన్న రహస్యాన్ని మా ఇంట్లో వాళ్లకు కూడా చెప్పలేదు!: 'కట్టప్ప' సత్యరాజ్


'బాహుబలి-1' సినిమా విడుదలైనప్పటి నుంచి దేశంలోని సినీ అభిమానులు అందరిలోనూ ఒకే ప్రశ్న. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఈ ప్రశ్న అందరికి ఓ పజిల్ లా మారింది. సాక్షాత్తు పార్లమెంటులో సైతం ఓ ఎంపీ సరదాగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆయన మాటలకు సభలోని అందరూ నవ్వుకున్నారు. ఇప్పుడు 'బాహుబలి-2' కూడా విడుదలకు సిద్ధమవుతోంది. అయినా, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో ఎవరికీ అర్థంకావడం లేదు. అటు దర్శకనిర్మాతలు కాని, ఇటు నటీనటులు కానీ, టెక్నీషియన్స్ కానీ ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు.

ఈ నేపథ్యంలో కట్టప్ప పాత్రను పోషించిన నటుడు సత్యరాజ్ ను మీడియా ఈ విషయం గురించి అడిగింది. దానికి సమాధానంగా, "ఈ ప్రశ్నను ఇప్పటి వరకు నన్ను చాలా మంది అడిగారు. అయినా నాకేమీ ఇబ్బందిగా లేదు. మీకో విషయం తెలుసా? బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న విషయాన్ని నా కుటుంబ సభ్యులకు కూడా నేను ఇంత వరకు చెప్పలేదు. రెండో భాగం విడుదలయ్యేంత వరకు ఈ విషయం రహస్యంగానే ఉంటుంది" అని సత్యరాజ్ తెలిపాడు. సోషల్ మీడియాలో కట్టప్పను బాగా వాడుకున్నారని... నోట్ల రద్దు సమయంలో కూడా కట్టప్ప క్యారెక్టన్ ను బాగా వాడుకున్నారని ఆనందం వ్యక్తం చేశాడు. తాను పోషించిన క్యారెక్టర్ కు ఇంత స్థాయిలో ఆదరణ లభించడం సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పాడు.

  • Loading...

More Telugu News