: యూపీలో బీజేపీ నెగ్గితే మరిన్ని కఠిన నిర్ణయాలు!
అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ నెగ్గితే ఏమవుతుందో విశ్లేషకులు ఈపాటికే ఒక నిర్ణయానికి వచ్చేశారు. యూపీ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోగా, ఎస్పీ-కాంగ్రెస్ కూటమి పీఠం కోసం పోరాడుతోంది. మాయావతి కూడా పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. ఇక ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రధాని మోదీ సైతం యూపీలో తిష్టవేసి మరీ ప్రచారం చేస్తున్నారు. యూపీలో గెలుపు ద్వారా 2019 వరకు తిరుగులేని శక్తిగా ఉండాలని బీజేపీ భావిస్తోంది.
ఈ ఎన్నికల్లో గెలుపు ద్వారా పార్టీలో తన ఆధిపత్యానికి తిరుగులేకుండా చూసుకోవాలని మోదీ భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీ కనుక యూపీలో గెలిస్తే పెద్దనోట్ల రద్దు లాంటి మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు చెబుతున్నారు. అలాగే హిందూత్వ శక్తుల ఏకీకరణ వేగం పుంజుకుంటుందని, పార్టీలోని సీనియర్ నేతలకు ఉద్వాసన తప్పదని జోస్యం చెప్పారు. మోదీకి నచ్చిన వ్యక్తులే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులుగా నియమించే శక్తిని యూపీ గెలుపు ఇస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.