: వైసీపీ కార్యాలయంలో టీడీపీ సీనియర్ నేత.. బొత్సతో భేటీ
టీడీపీ సీనియర్ నేత పతివాడ నారాయణస్వామి వైసీపీ కార్యాలయంలోకి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయనగరానికి చెందిన నారాయణస్వామి మంగళవారం అమరావతిలోని వైసీపీ శాసనసభాపక్ష కార్యాలయానికి వెళ్లారు. విజయనగరానికే చెందిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అయిన బొత్స సత్యనారాయణతో సమావేశమయ్యారు. వీరిద్దరి సమావేశంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే వైసీపీ ఎల్పీ కార్యాలయాన్ని చూసేందుకు మాత్రమే వచ్చానని, ఊహాగానాలకు తావు లేదని నారాయణస్వామి పేర్కొన్నారు.