: ‘రాజు గారి గది 2’ లో సమంత ఫొటో ఇదీ!
నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘రాజు గారి గది 2’ చిత్రంలో ఓ కీలక పాత్రలో సమంత కూడా నటిస్తోంది. ఆమెతో షూటింగ్ కూడా మొదలు అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే, నల్ల చీర కట్టుకుని, ఓర చూపులు చూస్తూ కూర్చున్న సమంత, తన ఫొటోను ఇన్ స్టా గ్రామ్ ఖాతా లో ఈ రోజు పోస్ట్ చేసింది. ‘‘రాజు గారి గది 2’లోని ఫొటో ఇదీ’ అని పేర్కొంది. ఈ ఫొటోపై ‘వావ్’, ‘పిక్చర్ పర్ఫెక్ట్’, ‘ఆసమ్’, ‘లవ్ యు ఎస్ఆర్పీ’... అంటూ కామెంట్స్ చేశారు.