: జేసీ ప్రభాకర్ రెడ్డీ! నువ్వు మా జగనన్నను తిట్టేంత వాడివా?: ఓ చిన్నారి ఘాటు వ్యాఖ్యలు
దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద సంఘటనపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ రాజకీయం చేస్తున్నారంటూ ఆయనపై టీడీపీ తాడిపత్రి ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి అసభ్య పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా మండిపడటం తెలిసిందే. అంతేకాకుండా, వైఎస్సార్సీపీ అభిమానులూ తమ దైన శైలిలో స్పందించారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా పలు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా, జేసీ ప్రభాకర్ రెడ్డిని తూర్పారబడుతూ ఓ వీడియోలో ఓ చిన్నారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘జేసీ ప్రభాకర్ రెడ్డిగా.. నువ్వు మా జగన్ అన్నని తిట్టేంత వాడివా?... నీకు జగనన్న అవసరం లేదు.. నేను చాలు.. మా రెడ్డి కులంలో తప్పుగా పుట్టావు.. జై జగన్.. జోహార్ వైఎస్సార్’ అని ఆ వీడియోలో ఆ చిన్నారి ఘాటు వ్యాఖ్యలు చేసింది.