: 10 లక్షల రూపాయలకు జూనియర్ ఎన్టీఆర్ బైక్ కొనుగోలు చేసిన అభిమాని


పర్యావరణ ప్రేమికుడిగా జూనియర్ ఎన్టీఆర్, మానవ సంబంధాలు ప్రేమించే వ్యక్తిగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కలిసి నటించిన 'జనతా గ్యారేజ్' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నడిపిన బైక్ ను అతని అభిమాని రాజ్ కుమార్ రెడ్డి సొంతం చేసుకున్నాడు. 'జనతా గ్యారేజ్' సినిమాలో సూపర్ హిట్ అయిన పాటలో జూనియర్ ఎన్టీఆర్ ఈ బైక్ తో కనిపిస్తాడు. ఈ బైక్ ను ఈ సినిమా నిర్మించిన మైత్రీ మువీ మేకర్స్ వేలం వేశారు. ఈ వేలంలో నల్గొండ జిల్లాకు చెందిన రాజ్ కుమార్ రెడ్డి 10 లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు. ఈ మొత్తాన్ని బసవతారక రామారావు ట్రస్ట్ కు విరాళంగా అందజేయనున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ చేతుల మీదుగా రాజ్ కుమార్ కు బైక్ ను అందజేశారు. జూనియర్ ఎన్టీఆర్ ను ఎంతగానో అభిమానించే తాను ఈ బైక్ కొనుగోలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని రాజ్ కుమార్ రెడ్డి చెప్పారు. 

  • Loading...

More Telugu News