: ఆస్తుల వివరాలను ప్రకటించిన నారా లోకేశ్
ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న టీడీపీ నేత నారా లోకేశ్ తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ లో పేర్కొన్నారు. తన పేరిట హెరిటేజ్ షేర్లు, ఇతర ఆస్తుల విలువ రూ. 273 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. తన స్థిరాస్తుల విలువ రూ.9.95 కోట్లుగా ఆయన పేర్కొన్నారు. తన భార్య నారా బ్రాహ్మణి పేరు మీద ఉన్న షేర్ల విలువ రూ.17.90 కోట్లు, స్థిరాస్తుల విలువ రూ.4.45 కోట్లు అని, తమ కుమారుడు దేవాన్ష్ పేరిట షేర్లు రూ.2.70 కోట్లు, స్థిరాస్తులు రూ.9.60 కోట్లు ఉన్నట్లు తన అఫిడవిట్ లో లోకేశ్ పేర్కొన్నారు.