: ఆన్ లైన్ లో విక్రయానికి తల్లిపాలు!
ఆన్ లైన్ వ్యాపారం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. మామూలు అంగట్లో దొరకని వస్తువులన్నీ ఆన్ లైన్ లో అమ్మకానికి లభ్యమవుతున్నాయి. ఇప్పుడు మరింత ఆశ్చర్యకరంగా ఓ అమ్మడు తల్లిపాలను విక్రయానికి పెట్టింది. అమెరికాలోని గోల్డ్ కోస్ట్ కు చెందిన ఇరవై ఏళ్ల ఈ మహిళ ఏమంటోందంటే... తన బిడ్డ ఆకలి తీరగా ఇంకా పాలుమిగిలిపోతున్నాయని, అవసరంలో ఉన్నవారు ఎవరైనా తల్లిపాలు కావాలంటే కొనుక్కోవచ్చని ప్రకటన ఇచ్చింది. ఆన్ లైన్ మాధ్యమంగా మాత్రమే తాను తల్లిపాలు విక్రయిస్తానని ఆమె ఆ ప్రకటనలో పేర్కొంది. తల్లిపాలు అవసరం ఉన్నవారు ఎవరైనా తనను సంప్రదించవచ్చని ఆమె తెలిపింది.