: ప్రభుత్వ ఒత్తిడితోనే సాయిబాబాకు జైలు శిక్ష విధించారు: వరవరరావు
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల కేసులో ప్రొఫెసర్ సాయిబాబాకు ఢిల్లీ గడ్చిరోలి కోర్టు యావజ్జీవ శిక్ష విధించడంపై విరసం నేత వరవరరావు స్పందించారు. ప్రభుత్వ ఒత్తిడితోనే సాయిబాబాకు యావజ్జీవ శిక్ష విధించారని, ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని, ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వారిపై కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు.