: పృథ్వీ ఇకపై పేరడీ సీన్లు చేయడట!
తెలుగు చిత్రసీమలో స్టార్ కమెడియన్గా వెలుగొందుతున్న నటుడు పృథ్వీ.. టాప్ హీరోలను అనుకరిస్తూ డైలాగులు చెబుతూ ప్రేక్షకులని నవ్వుల్లో ముంచెత్తుతోన్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ అటువంటి పాత్రలతోనే ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న పృథ్వీ ఇకపై అటువంటి పాత్రలు చేయడట. రాబోయే సినిమాల్లో పేరడీ సీన్లకు దూరంగా వుండాలని తను నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇక నుంచి ఆయన నటించనున్న సినిమాల్లో ఎటువంటి గెటప్లలో కనిపిస్తాడో చూడాలి మరి.