: సిమ్ కార్డులను ఆమె ముఖం పైకి విసిరి కొట్టిన బిపాసా బసు!


బాలీవుడ్ ముద్దుగుమ్మ బిపాసా బసు తమతో వ్యవహరించిన తీరుపై ఇండియా-పాకిస్తాన్ లండన్ ఫ్యాషన్ షో నిర్వాహకులు వాపోయారు. లండన్ ఫ్యాషన్ లో పాల్గొనేందుకు బిపాసా ఎన్నో షరతులు పెట్టినప్పటికీ తాము అంగీకరించినా, చివరకు ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇండియా-పాకిస్తాన్ లండన్ ఫ్యాషన్ షో నిర్వాహకురాలు రోణిత శర్మ రేఖీ మాట్లాడుతూ, తనతో పాటు తన భర్త కరణ్ ను కూడా లండన్ తీసుకురావాలని బిపాసా కోరడంతో తాము అంగీకరించామని, లండన్ లోని ఫైవ్ స్టార్ హోటల్ 'మే ఫెయిర్' హోటల్ లో ఉండేందుకు వారికి గదులు కూడా బుక్ చేశామని అన్నారు.

అయితే, అనుకున్న దాని కంటే ఎక్కువ రోజులు ఉండటంతో మరో ఫైవ్ స్టార్ లో రూమ్స్ బుక్  చేయాల్సి వచ్చిందని, ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఆమెకు అడ్వాన్స్ తో పాటు ప్రయాణ ఖర్చుల కింద నగదు రూపంలో కొంత డబ్బు కూడా ఇచ్చామని చెప్పారు. ఒక్కొక్క సిమ్ కార్డులో ఐదు పౌండ్లు చొప్పున రీఛార్జి చేయించిన రెండు లోకల్ సిమ్ కార్డులను లండన్ లో దిగిన వెంటనే బిపాసాకు అందజేశామని, అయితే, తక్కువ మొత్తంలో రీఛార్జి చేస్తారా? అంటూ ఆ సిమ్ కార్డులను తన ముఖం పైకి బిపాసా విసిరికొట్టిందని రోణిత శర్మ రేఖీ ఆరోపించారు.

ఆమె ఈ విధంగా చేసినప్పటికీ తాము పట్టించుకోలేదని, షో కు హాజరు కావాలని బతిమలాడినా బిపాసా వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అన్ని విధాలా నష్టం చేసిన బిపాసాను వదిలిపెట్టమని రోణిత అన్నారు. అయితే, ఈ ఆరోపణలను బిపాసా కొట్టిపారేసింది. ఇప్పటివరకు తన కెరీర్ లో ఈ విధంగా ఎప్పుడూ ప్రవర్తించలేదని బిపాసా చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News