: ఎమ్మెల్యేను కూడా వదలని కామ పిశాచులు...ఫోన్ లో వేధింపులు
ప్రజాప్రతినిధిని కూడా కామపిశాచులు వదలడం లేదు. ఫోన్ నెంబర్ సంపాదిస్తే చాలు ఫోన్ చేసి వేధింపులకు దిగడం సర్వసాధారణంగా మారింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే వర్షా గైక్వాడ్ మొబైల్ కు గుర్తు తెలియని ఆగంతుకుడు బూతు మెసేజ్ లు పంపి వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజకీయాల్లో ఉన్న చాలామంది మహిళా నేతలకు ఇలాంటి అసభ్యకర మెసేజ్ లు వస్తున్నాయని చెప్పారు. పురుషాధిక్య రాజకీయాల్లోకి వస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి వేధింపులకు దిగడం ట్రెండ్ గా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి ప్రజాప్రతినిధులకే ఇలాంటి వీడియోలు పంపి వేధింపులకు దిగితే, సామాన్యజనం పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. దీనిపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఆమె చెప్పారు. దీనిపై కేసు నమోదు చేశామని, నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.