: కీలక నిర్ణయాలతో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన టీజేఏసీ
రాష్ట్రం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం హామీలు నెరవేర్చలేకపోయిందని విమర్శిస్తోన్న టీజేఏసీ ఈ రోజు హైదరాబాద్‌లో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసి పలు నిర్ణయాలు తీసుకుంది. తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. ప్రభుత్వ పాలనపై ప్రశ్నించే శక్తులు లేకుండా చేయాలనే కుట్రను తిప్పికొట్టాలని నిర్ణయించింది. అప్రజాస్వామిక ధోరణిని ఖండిస్తున్నట్లు తేల్చిచెప్పింది. కుట్రలకు ఊతమిస్తున్న తమ సభ్యులు పి.రవీందర్, ఎన్.ప్రహ్లాద్‌లను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు కార్యాచరణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. బలహీన వర్గాల నిధుల తరలింపును వెలుగులోకి తేనున్నట్టు, రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లాల యాత్రలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.