: ట్రంప్ పేరు చెబితే భారతీయులు.. చంద్రబాబు పేరు చెబితే ప్రపంచ సంస్కృతి భయపడుతోంది: జగన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు చెబితే మొత్తం భారతీయులంతా ఎలా భయపడుతున్నారో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పేరు చెబితే మన సంస్కృతే కాక ప్రపంచ సంస్కృతి కూడా భయపడుతోందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. సత్య నాదెళ్లకు చంద్రబాబే స్ఫూర్తి అని చెప్పుకుంటారని అన్నారు. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో కావడానికి కూడా తానే కారణమంటూ వ్యాఖ్యలు చేస్తారని అంటారని చెప్పారు. అన్నింటికి చంద్రబాబే కారణమని చెప్పుకుంటారని అన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నెంబర్.1 అంటూ పలు సంస్థలు సర్వేల్లో తేల్చాయని ఆయన అన్నారు. రాష్ట్రం దూసుకుపోతోందని చంద్రబాబు చెప్పుకుంటోన్న గొప్పలకి అందరూ భయపడిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.