: విజయంపై తొలి సారి ఆశలు... ప్రమాదకర స్మిత్ ను పంపించిన ఉమేష్
అసాధ్యం కాని 188 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టులో ప్రమాదకరంగా మారిన స్మిత్ ను బారత సీమర్ ఉమేష్ యాదవ్ పెవీలియన్ కు పంపడంతో, ఈ మ్యాచ్ లో భారత విజయంపై మొట్టమొదటి సారిగా ఆశలు చిగురించినట్లయింది. 48 బంతులను ఎదుర్కొన్న స్మిత్ మూడు ఫోర్ల సాయంతో 28 పరుగులు చేశాడు. ఆపై క్రీజులో ఉన్న హ్యాండ్స్ కొంబ్ కు మిచెల్ మార్ష్ జత కలిశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా తన విజయానికి 113 పరుగులు చేయాల్సివుండగా, భారత బౌలర్లు 6 వికెట్లను తీస్తే, సిరీస్ ను 1-1తో సమం చేయవచ్చు.