: శంషాబాద్ విమానాశ్రయానికి మ‌రో ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డు


ఇప్ప‌టికే ఎన్నో అవార్డులు అందుకున్న హైదరాబాద్ శివారులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మ‌రో ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డు అందుకోనుంది. ప్రపంచంలోనే అత్యుత్త‌మ స‌ర్వీసును అందిస్తోన్న విమానాశ్రయంగా ఆ విమానాశ్ర‌యానికి గుర్తింపు వ‌చ్చింది. ప్ర‌పంచంలోని మొత్తం 300కి పైగా విమానాశ్రయాలను ప‌రిశీలించిన ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) శంషాబాద్ విమానాశ్ర‌యాన్నే అత్యుత్త‌మ సేవ‌లందించే ఎయిర్‌పోర్టుగా గుర్తించింది.

గత ఏడాది 5-15 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఎయిర్‌పోర్టుల‌ కేటగిరీలో 2016కు గానూ స‌ద‌రు విమానాశ్ర‌యం ఈ ఏడాది మారిష‌స్‌లో ఈ అవార్డు అందుకోనుంది. ఐదు పాయింట్ల స్కేలుపై 2009లో 4.4 పాయింట్లు సాధించిన స‌ద‌రు విమానాశ్ర‌యం.. క్ర‌మంగా పాయింట్లు మెరుగు ప‌రుచుకుంటూ వ‌స్తూ 2016లో 4.9 పాయింట్లు సాధించి తొలిస్థానంలో నిలిచింది. ఇదే సర్వేలో మ‌న‌దేశానికే చెందిన‌ ఢిల్లీ  విమానాశ్ర‌యం రెండో స్థానంలో నిలవ‌డం విశేషం.

  • Loading...

More Telugu News