: సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్న గుత్తా జ్వాల
ప్రముఖ షట్లర్ గుత్తా జ్వాల సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తోంది. ఇన్నాళ్లు తన ఆటతో దేశానికి, హైదరాబాదుకి పేరు తెచ్చిన జ్వాల... ఇప్పుడు బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభిస్తోంది. ఈ అకాడమీ ఏర్పాటుకు ఇప్పటికే సర్వం సిద్ధమైంది. ఈ నెల 11వ తేదీన అకాడమీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ అకాడమీకి 'జ్వాలా గుత్తా గ్లోబల్ అకాడమీ ఫర్ బ్యాడ్మింటన్' అని పేరు పెట్టారు. ఈ అకాడమీ ద్వారా మెరికల్లాంటి షటిల్ ప్లేయర్లను తయారు చేయడమే లక్ష్యమని ఈ సందర్భంగా గుత్తా జ్వాల తెలిపింది.