: నీ నాలుగు అబార్షన్ల గురించిన రిపోర్టు చూస్తావా?: గాయని చిన్మయి శ్రీపాదపై విరుచుకుపడ్డ సుచిత్ర
తన ట్వీట్లతో దక్షిణాది సినీ పరిశ్రమలో సంచలనం కలిగిస్తున్న గాయని సుచిత్రా కార్తీక్, ఈ సారి మరో గాయని చిన్మయీ శ్రీపాదపై పడింది. ఆమెను టార్గెట్ చేసుకుని సుచిత్ర సంచలన వ్యాఖ్యలు చేసింది. "2016లో నువ్వు చేయించుకున్న నాలుగు అబార్షన్ల వివరాలను వెల్లడించాలా? డాక్టర్ల రిపోర్టులు నాకు తెలుసు. నా దగ్గర వాటి కాపీలు ఉన్నాయి. నీకు చూడాలని ఉందా?" అని ప్రశ్నించింది. అంతకుముందు తనను టార్గెట్ చేసుకుని సుచిత్ర చేస్తున్న ట్వీట్లపై చిన్మయి స్పందిస్తూ, తాను కేవలం టాలెంటుతోనే ఇండస్ట్రీలో పైకి వచ్చానని, ఎక్కడా అడ్జస్ట్ మెంట్ కాలేదని చెప్పుకొచ్చింది. సుచిత్ర తన జీవితాన్ని గడుపుతున్నట్టుగానే ఇతరులూ ఉన్నారని అనుకొంటోందని విమర్శించింది. కాగా, వివిధ వర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు ట్విట్టర్ యాజమాన్యం సుచిత్ర ఖాతాలను సస్పెన్షన్ లో ఉంచింది.