: ఇది సినిమా స్టోరి కాదు.. లోకల్ ట్రైన్‌లో కలుసుకొని ప్రేమికులయ్యారు!


ఆ యువ‌తీ యువ‌కులు ప్రతిరోజూ లోకల్ ట్రైన్‌లో ప్ర‌యాణించారు. ఆ ట్రైనే వారి ప‌రిచ‌యానికి వేదికైంది. ఆ ప‌రిచయం ప్రేమ‌గా మారింది... వారిద్ద‌రినీ ఒక్క‌టి చేసింది. సినిమా స్టోరీని త‌ల‌ద‌న్నేలా ఉన్న ఈ నిజజీవిత ప్రేమ కథ అందరిలోనూ ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఒక‌టి కాదు రెండేళ్లు కాదు.. వారి పదేళ్ల ప్రయాణం ఆ లోకల్ ట్రైన్‌లోనే జ‌రిగింది. ఆస్ట్రేలియాకు చెందిన ర్యాన్ జక్కా(35)... హన్నా డిట్రిచ్(27) అనే త‌న తోటి ప్ర‌యాణికుల‌రాలికి  తాజాగా ప్ర‌పోస్ చేశాడు. అదీ అంద‌రూ చూస్తుండ‌గా అదే లోక‌ల్ ట్రైన్‌లో. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. వీరి ప్రేమ వందేళ్లు ఇలాగే ఉండాల‌ని వారికి నెటిజ‌న్లు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. ట్రైన్‌లోని 400 మంది ప్రయాణికులు ఈ జంట‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఆ దేశ మెట్రో రైలు అధికారులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.


  • Loading...

More Telugu News