: రూ.17లక్షల విలువ చేసే సెటారిని శ్రీవారికి సమర్పించిన బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ చింతల రామచంద్రారెడ్డి ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన కుమారుడు రామానుజ 15వ పుట్టినరోజు మొక్కును చెల్లించుకున్నారు. శ్రీవారికి బంగారు సెటారిని కానుకగా సమర్పించారు. ఈ సెటారీ విలువ 17లక్షల రూపాయల విలువ చేస్తుంది. దీని బరువు 502 గ్రాములు. ఈ సెటారిని శ్రీవారి పాదాల చెంత ఉంచిన పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దానిని బొక్కసం అధికారులకు అందజేశారు.