: అలాగైతే.. మూడేళ్ల సస్పెన్షన్ కు కూడా నేను సిద్ధమే: రోజా
గతంలో తాను మాట్లాడిన అంశాలన్నింటినీ వారికి అవసరమైన చోట కట్ చేసి, దాన్ని ఓ వీడియోగా తయారు చేసి విడుదల చేశారంటూ టీడీపీపై వైకాపా ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఈ వీడియో కాకుండా, పూర్తి వీడియోను విడుదల చేయాలని... అప్పుడు నిజనిజాలన్నీ ప్రజలకు తెలుస్తాయని... అప్పుడు కూడా తాను తప్పు చేశానని తేలితే, రెండేళ్లు కాదు, మూడేళ్ల సస్పెన్షన్ కు కూడా తాను సిద్ధమేనని ఆమె అన్నారు. తాను చేస్తున్న పోరాటమంతా మహిళల ఆత్మగౌరవం కోసమేనని చెప్పారు. అసెంబ్లీ స్పీకర్ అనుమతి లేకుండా, అసెంబ్లీ వీడియోలు బయటకు ఎలా వచ్చాయని రోజా ప్రశ్నించారు. వీడియోను మీడియాకు లీక్ చేసిన కాల్వ శ్రీనివాసులుపై ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని అన్నారు.