: సరబ్ మృతిపై ప్రధాని విచారం.. మృతదేహాన్ని భారత్ రప్పించేందుకు చర్యలు
పాకిస్థాన్ ఆసుపత్రిలో కన్నుమూసిన సరబ్ జిత్ సింగ్ మృతిపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సరబ్ ను భారత్ పంపించాలన్న విజ్ఞప్తిని పాక్ నిర్లక్ష్యం చేసిందన్నారు. తక్షణమే మృతదేహాన్ని భారత్ కు రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని తెలిపారు. కాగా, సరబ్ మృతికి కారణమైన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని పాక్ ప్రభుత్వాన్ని ప్రధాని డిమాండు చేశారు. అటు సరబ్ కుటుంబ సభ్యులను కేంద్రం హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే పరామర్శించారు. సరబ్ మరణం అత్యంత విషాదకర సంఘటన అని పేర్కొన్నారు. కుటుంబానికి న్యాయం చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని షిండే చెప్పారు. మరోవైపు సరబ్ జిత్ మృతిపై పాక్ పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ డిమాండు చేశారు.