: తప్పు చేయలేదు... క్షమాపణ చెప్పేది లేదు: రోజా

అసెంబ్లీలో తాను క్షమాపణ కోరే సమస్యే లేదని వైకాపా శాసనసభ్యురాలు రోజా వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె, తాను ఏ తప్పూ చేయలేదని, ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి నిజమైన వీడియో క్లిప్పింగ్స్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అప్పుడే వాస్తవాలన్నీ బయటకు వస్తాయని చెప్పిన రోజా, వీడియో క్లిప్పింగ్స్ దొంగిలించిన కాల్వ శ్రీనివాసులుపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఆమె అసెంబ్లీలో ఎమ్మెల్యే అనితకు బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందేనని ఈ ఉదయం మంత్రి యనమల తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.