: హర్యానాలో భార్యను కోల్పోయిన భర్తలకూ పింఛను ఇచ్చే పథకంపై కసరత్తు!


భ‌ర్త మృతి చెందితే భార్య‌కు పింఛ‌ను ఇచ్చే ప‌థ‌కాలు పలు రాష్ట్రాల్లో అమ‌లులో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, భార్య చ‌నిపోతే కూడా భ‌ర్త‌ల‌కు పింఛ‌ను ఇచ్చే ప‌థ‌కాన్ని తీసుకురావాల‌ని హ‌ర్యానా స‌ర్కారు యోచిస్తోంది. నిన్న ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌ ఈ అంశంపైనే ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ప‌థ‌కానికి కావ‌ల‌సిన బ‌డ్జెట్‌, స‌ర్కారుపై ప‌డే అద‌న‌పు భారాల‌ వంటి అంశాల గురించి ఆ రాష్ట్ర అధికారులు లెక్క‌లు చూస్తున్నారు.

దీనిపై ఆ రాష్ట్ర స‌ర్కారు తుది నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది. వచ్చే ఏడాది నుంచి ఈ కొత్త పథకాన్ని అమల్లోకి తేవాలని చూస్తోంది. ఆ రాష్ట్ర‌ అసెంబ్లీ సమావేశాల్లో ఓ ఎమ్మెల్యే ఈ పథకాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతూ.. భార్యను కోల్పోయిన భ‌ర్త‌ని కూడా వితంతువుగానే పరిగణించి వారికి కూడా పెన్షన్ ఇవ్వాలని వ్యాఖ్యానించారు. దీనిపై ఖట్టర్ స్పందిస్తూ.. ఈ ప‌థ‌కాన్ని తప్పకుండా పరిశీలిస్తామని  తెలిపారు.

  • Loading...

More Telugu News