: భారత జాలర్లపై కాల్పులు జరిపిన శ్రీలంక నేవీ


బంగాళాఖాతంలో చేపలు పట్టేందుకు వెళ్లిన జాలర్లపై శ్రీలంక నేవీ సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 22 ఏళ్ల ఓ జాలరి ప్రాణాలు విడిచాడు. నిన్న రాత్రి కచ్చతీవులు సమీపంలోని పాల్క్ స్ట్రెయిట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

నిన్న చేపలు పట్టేందుకు తమిళనాడులోని రామేశ్వరం నుంచి పెద్ద సంఖ్యలో జాలర్లు వెళ్లారు. వీరంతా కచ్చతీవులు సమీపంలో చేపలు పడుతుండగా... శ్రీలంక నేవీ సిబ్బంది అక్కడకు చేరుకుంది. కనీసం హెచ్చరికలు కూడా చేయకుండానే... జాలర్లపై కాల్పులు జరిపింది. ఆ సమయంలో మొత్తం 2వేల మంది జాలర్లు అక్కడ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో బ్రిత్సో అనే మత్స్యకారుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాత్రి 12.30 గంటలకు వీరంతా ఒడ్డుకు చేరుకున్నారు. బ్రిత్సో మరణంతో మత్స్యకారుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.   

  • Loading...

More Telugu News