: శాసనసభ నుంచి వాకౌట్ చేసిన జగన్


ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై మరొకరు వాగ్బాణాలు విసురుకుంటూ సభలో వేడిని పుట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని... వారి కోసం ప్రభుత్వం ముష్టి వేస్తోందని ఆరోపిస్తూ వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.  ఎస్సీ, ఎస్టీలకు విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం... వారికి ముష్టి వేసినట్టుగా కేవలం రూ. 78 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభనుంచి వాకౌట్ చేస్తున్నామని జగన్ చెప్పారు. తమ పార్టీ సభ్యులతో కలసి సభ నుంచి వాకౌట్ చేశారు. 

  • Loading...

More Telugu News