: జగన్ 'ముష్టి' వ్యాఖ్యలపై అనిత ఫైర్!


నవ్యాంధ్ర అసెంబ్లీలో తొలి సమావేశాల్లో భాగంగా, ఈ ఉదయం స్పీకర్ చేపట్టిన ప్రశ్నోత్తరాలు సైతం హాట్ హాట్ గా సాగాయి. ఉచిత విద్యుత్ అంశంపై వచ్చిన ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానం సరిగ్గా లేదంటూ, విద్యుత్ బిల్లులు ఎక్కువగా వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వైఎస్ హయాంలో రూ. 150 లోపు వచ్చే బిల్లులు ఇప్పుడు రూ. 600కు పైగా వస్తున్నాయని జగన్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లిస్తున్నామంటూ, ముష్టి వేసినట్టుగా రూ. 78 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని దుయ్యబడుతూ, ప్రభుత్వ వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆపై తెలుగుదేశం సభ్యురాలు అనిత మాట్లాడుతూ, దళిత శాసనసభ్యురాలిగా, జగన్ వాడిన 'ముష్టి' పదంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన వైఎస్, ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని నిప్పులు చెరిగారు. జగన్ వెంటనే తాను వాడిన అసభ్య పదజాలాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News