: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం వివరాలు!


తెలుగు సినీ నటీనటుల సంఘమైన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కొత్త కార్యవర్గం కొలువుదీరింది. 'మా' అధ్యక్షుడిగా శివాజీరాజా, ప్రధాన కార్యదర్శిగా నరేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీలో ఎనిమిది మంది ఆఫీస్ బేరర్లు, పద్దెనిమిది మంది కార్యనిర్వాహక సభ్యులు కూడా ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. రెండేళ్ల పాటు ఈ కమిటీ కొనసాగుతుంది.

మా కొత్త కార్యవర్గం ఇదే...

అధ్యక్షుడు: శివాజీరాజా
కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు: శ్రీకాంత్
ఉపాధ్యక్షులు: ఎంవీ బెనర్జీ, వేణుమాధవ్‌
ప్రధాన కార్యదర్శి: నరేశ్ (సీనియర్)
సంయుక్త కార్యదర్శులు: హేమ, ఏడిద శ్రీరామ్‌
కోశాధికారి: పరుచూరి వెంకటేశ్వరరావు
కార్యవర్గ సభ్యులు: ఎ.లక్ష్మీనారాయణ, ఉత్తేజ్‌, అనితాచౌదరి, గౌతంరాజు, సి.వెంకటగోవింద రావు, ఎం.ధీరజ్‌, పసునూరి శ్రీనివాసులు, గీతాసింగ్‌, ఎం. హరనాథ్‌బాబు, హెచ్.జయలక్ష్మి, జితమోహన్ మిత్ర, కొండేటి సురేశ్, కుమార్‌ కొమాకుల, వి.లక్ష్మీకాంతరావు, ఎం.నర్సింగ్‌ యాదవ్‌, ఆర్‌.మాణిక్‌, నాగినీడు వెల్లంకి, సురేశ్. 

  • Loading...

More Telugu News