: ప్రయాణికులకు విజ్ఞప్తి.. నేడు నడికుడి రైలు మార్గం మూసివేత!


నడికుడి మార్గంలో ప్రయాణించే వారికి రైల్వే ఓ విజ్ఞప్తి చేసింది. ఈ ఉదయం 11.45 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మార్గాన్ని మూసేస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకు ప్రయాణికులు సహకరించాలని కోరింది. ఈమేరకు రైల్వే సీనియర్ డీసీఎం కె.ఉమామహేశ్వరరావు ఓ ప్రకటన విడుదల చేశారు. నల్లపాడు-బండారుపల్లి రైల్వే స్టేషన్ మధ్య ఆర్‌సీసీ సెగ్మెంట్స్ అమర్చేందుకు లైన్‌ను కొన్ని గంటలపాటు బ్లాక్ చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా  హైదరాబాద్‌ - కొచ్చువేలి శబరి ఎక్స్‌ప్రెస్‌ను 40 నిమిషాలు, సికింద్రాబాద్‌-రేపల్లె ప్యాసింజర్‌ని 30 నిమిషాలు, విశాఖపట్టణం - సికింద్రాబాద్‌ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలును వంద నిమిషాలపాటు మార్గమధ్యంలో నిలిపేయనున్నట్టు తెలిపారు. అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News