: ‘సరబ్ జిత్’ లో ఐశ్వర్య నటనకు ప్రశంసలు .. ఐఎఫ్ఎఫ్ఏఏ ఉత్తమ నటిగా ఎంపిక!


‘సరబ్ జిత్’ చిత్రంలో ఐశ్వర్యా రాయ్ నటనకు గాను ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అండ్ అవార్డ్స్ ఆఫ్ ఆస్ట్రేలియా (ఐఎఫ్ఎఫ్ఏఏ) అవార్డులను ప్రకటించింది. సరబ్ జీత్ చిత్రంలో దల్బీర్ కౌర్ పాత్రలో ఐశ్వర్య కనబరిచిన నటనా కౌశలం అద్భుతమంటూ ఉత్తమ నటిగా ఆమెను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. సరబ్ జిత్ చిత్ర బృందానికి ఈ సందర్భంగా తన శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఈ చిత్రం గత ఏడాది మే 20న విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచే కాక, విమర్శకుల నుంచి సైతం మన్ననలు లభించాయి. 

  • Loading...

More Telugu News