: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా శివాజీరాజా ఏకగ్రీవం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా నటుడు శివాజీ రాజా ఈ రోజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019 వరకు ఈ పదవిలో ఆయన కొనసాగనున్నారు. ‘మా’ ప్రధాన కార్యదర్శిగా నరేష్, ఉపాధ్యక్షులుగా ఎంవీ బెనర్జి, వేణు మాధవ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ, ‘మా’ సభ్యుల నమ్మకాన్ని నిలబెడతానని, ప్రస్తుతం 30 మంది కళాకారులకు ఇస్తున్న పింఛన్ ను 25 శాతం పెంచనున్నామని, ‘మా’ 25 ఏళ్ల ఉత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తామని అన్నారు.