: ఎమ్మెల్యే బాలకృష్ణ కొత్త పీఏ ఖరారు!


హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొత్త పిఏగా సచివాలయ ఉద్యోగి వి.వీరయ్యను నియమించారు. ఆర్థిక శాఖలో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గా వీరయ్య పని చేస్తున్నారు. కాగా, ఇంతకు ముందు బాలకృష్ణ కు పిఏ గా వ్యవహరించిన శేఖర్ పై హిందూపురం నియోజకవర్గ టీడీపీ నాయకులు, ప్రజలు పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ పదవి నుంచి శేఖర్ ను పక్కన పెట్టి వీరయ్యను నియమించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News