: ‘ద్వారక’ చిత్ర బృందం కృతఙ్ఞతలు చెబితే.. హీరో మాత్రం క్షమాపణలు చెప్పాడు!


హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘ద్వారక’ చిత్రం ఈ నెల 3న విడుదలైన విషయం తెలిసిందే. శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సక్సెస్ మీట్ లో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు చిత్ర బృందం కృతఙ్ఞతలు తెలిపింది. అయితే, హీరో విజయ్ దేవరకొండ మాత్రం ‘క్షమాపణలు’ చెబుతున్నాను అని అన్నాడు. ఎందుకంటే, కొంత మంది ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చలేదని, అందుకే, వారికి క్షమాపణలు చెబుతున్నానని అన్నాడు.

ఇకపై అందరికీ నచ్చే సినిమాలు తప్పకుండా చేస్తానని అన్నాడు. తాను, చిత్ర బృందం ఈ కథను నమ్మి అంకిత భావంతో ఈ సినిమా చేశామన్నారు. తన కోరిక ఒకటేనని, తాను పది సినిమాల్లో నటించిన తర్వాత.. ‘వికీ పీడియా’లోని తన పేజ్ ఓపెన్ చేసి చూస్తే తాను నటించిన అన్ని సినిమాలు డిఫరెంట్ గా ఉండాలని అన్నాడు. అందుకే, ప్రతి సినిమాలో ఓ కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని చెప్పాడు. కాగా, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘పెళ్లి చూపులు’ చిత్రంలో నటించిన విజయ్ దేవరకొండ నటించిన మూడో చిత్రం ‘ద్వారక’. 

  • Loading...

More Telugu News