: ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ సర్కారు నిధులు దుర్వినియోగం చేస్తోంది: ప్రొ.కోదండరాం
తెలంగాణ ప్రభుత్వంపై టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం మరోసారి మండిపడ్డారు. ప్రాజెక్టుల విషయంలో గోదావరి, కృష్టా జలాల వినియోగం, ప్రాజెక్టుల పునరాకృతిపై పున:పరిశీలన అనే అంశంపై హైదరాబాద్‌లో ఈ రోజు వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అందులో పాల్గొన్న కోదండరాం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర సర్కారు ప్రాజెక్టుల పేరుతో నిధులు దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టుల ఖర్చుపై పునరాలోచన చేయాలని అన్నారు. స్పష్టమైన జలవిధానం ప్రకటించాలని ఆయన పేర్కొన్నారు.