: రోడ్డు మీద ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి: జేసీ ప్రభాకర్ రెడ్డిపై జగన్ కామెంట్
జేసీ దివాకర్ రెడ్డి చేసిన పరుష వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ స్పందించనంటూనే తీవ్రంగా స్పందించారు. దివాకర్ ట్రావెల్స్ యాక్సిడెంట్ పై జగన్ ఓవర్ యాక్షన్ చేశాడంటూ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు దిగుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేతను 'తేల్చుకుందాం రా' అని సవాలు విసిరిన సంగతి తెలిసిందే. తన కొడుక్కి కారు కొన్నప్పుడు జగన్ కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దానిపై విజయవాడలోని ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ లో జగన్ ప్రెస్ మీట్ సందర్భంగా మీడియా ప్రతినిధులు స్పందన కోరారు. వారి డిమాండ్ పై స్పందించిన జగన్ మాట్లాడుతూ, 'రోడ్డు మీద ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి...జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై నేను స్పందించను' అన్నారు.