: సమంత ఫ్యాన్స్ కి శుభవార్త.. చెర్రీ సినిమాలో సమంతే హీరోయిన్!
అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్-శ్రియా భూపాల్ ల పెళ్లి రద్దు కారణంగా చెన్నై బ్యూటీ సమంత- అక్కినేని నాగచైతన్యల వివాహం అనుకున్న దానికన్నా కాస్త ముందుగానే జరగనుందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్ తేజ్ హీరోగా వస్తోన్న సినిమాలో కనిపించబోదేమోనని ఆమె ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో, ఈ విషయంలో హీరోయిన్ ఎవరనే వార్తలపై ఈ రోజు ఆ చిత్రం యూనిట్ స్పందిస్తూ... ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 20 నుంచే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమౌతుందని తెలిపింది. ఈ నెల 22 నుంచి సమంత చిత్రీకరణలో పాల్గొంటుందని స్పష్టతనిచ్చింది. ఈ ఏడాది జులై చివరికి కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని యోచిస్తున్నారట. మరోవైపు దేవిశ్రీ ప్రసాద్ సినిమా పాటల పనులు కూడా పూర్తి చేశారని తెలిపింది.