: 'పెళ్లి నిశ్చియించింది ఏసుక్రీస్తు....అతిథులు శివుడు, బుద్ధుడు' అంటున్న బాలీవుడ్ భామ!


బాలీవుడ్ భామ, మోడల్‌ సోఫియా హయత్‌ (బిగ్ బాస్ రియాలిటీ షో ఫేం) గుర్తుందా?... రోహిత్ ట్రిపుల్ సెంచరీ చేసిన సందర్భంలో 'రోహిత్ కోసం..' అంటూ ఒక అర్ధ నగ్న ఫోటోను సోషల్ మీడియా ద్వారా పోస్టు చేసి కలకలం రేపింది. ఆ తరువాత జీవితంలో ప్రేమ, పెళ్లి లాంటివి వద్దని చెబుతూ సన్యాసం తీసుకున్నానని తెలిపింది. దీంతో అమె సన్నిహితులు ఆశ్చర్యపోయారు. అప్పటికే బాలీవుడ్ లో శృంగారతారగా, ఐటెం గర్ల్ గా పేరుతెచ్చుకున్న సోఫియా, సన్యాసినైపోయాననడంతో బాలీవుడ్‌ నిర్ఘాంతపోయింది. తరువాత వరల్డ్ టూర్ కెళ్తున్నానని చెప్పి, సోషల్ మీడియాలో వివిధ ప్రాంతాల్లో దిగిన ఫోటోలు పోస్టు చేసేది.

ఆ తరువాత మరి కొన్ని రోజులకు ఫ్యాషన్ దుస్తులు ధరించి సన్యాసానికి బాయ్ చెప్పినట్టు చెప్పకనే చెప్పింది. ఇప్పుడు తాజాగా పెళ్లి చేేసుకోబోతున్నానని ప్రకటించింది. అంతటితో ఆగితే అంతా బాగుండేది. తన పెళ్లిని జీసస్ స్వర్గంలో నిర్ణయించాడని తెలిపిన సోఫియా, తన పెళ్లికి మహాశివుడు, బుద్ధుడు అతిథులుగా హాజరుకానున్నారని పేర్కొంది. వారే కాకుండా రాఖీ సావంత్, బిగ్ బాస్ లో తనతో పాల్గొన్న వారందర్నీ తన వివాహానికి ఆహ్వానిస్తానని చెప్పింది. త్వరలో తనకు కాబోయే భర్త గురించి వెల్లడిస్తానని ప్రకటించింది.

దీంతో సోఫియా ఏం చెబుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కొందరు మాత్రం 'తను మానసికంగా దెబ్బతిన్నట్టుంది, అందుకే ఇలా ప్రవర్తిస్తోంద'ని పేర్కొంటున్నారు. ఆమెను బాలీవుడ్ పట్టించుకోకపోవడానికి తోడు, ఫ్యాషన్ ఇండస్ట్రీ కూడా పెద్దగా అవకాశాలు ఇస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో సోఫియా వార్తలలో కనిపించేందుకు ఇలా రకరకాల అవతారాల్లో కనిపిస్తోందని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.

  • Loading...

More Telugu News