: వాళ్ల నాశనాన్ని మీ కళ్లతో చూసే అవకాశాన్ని భగవంతుడు ఇస్తాడు: ఫోటోల లీకులపై త్రిష


యంగ్ హీరోలు ధనుష్, రానాలతో హీరోయిన్ త్రిష అత్యంత సన్నిహితంగా ఉన్న ప్రైవేట్ ఫొటోలను గాయని సుచిత్ర లీక్ చేసిన సంగతి తెలిసిందే. త్రిషతో పాటు ఇతర హీరోలు, హీరోయిన్ల ఫొటోలను కూడా సుచిత్ర లీక్ చేసింది. ఈ లీక్ ఫొటోలు సంచలనం రేపుతున్నా సుచి బాధితులు ఎవరూ స్పందించలేదు. త్రిష మాత్రం పరోక్షంగా సుచిత్రపై విరుచుకుపడింది. "ఇలాంటి వారిపై పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. జరుగుతున్నది చూస్తూ ప్రశాంతంగా ఉండండి. మిమ్మల్ని బాధ పెట్టిన వారు వారంతట వారే నాశనం అయిపోతారు. మీకు అదృష్టం ఉంటే... వాళ్ల నాశనాన్ని మీ కళ్లతో చూసే అవకాశాన్ని కూడా భగవంతుడు ఇస్తాడు" అంటూ ట్వీట్ చేసింది.

  • Loading...

More Telugu News