: పెగ్గులోకి నీళ్లివ్వలేదని దారుణం.. కన్నతండ్రినే చావగొట్టి హత్య చేసిన తనయుడు


ఢిల్లీలోని బిందాపూర్‌లో ఓ వ్య‌క్తి త‌న క‌న్న తండ్రిప‌ట్లే కాల‌య‌ముడిలా ప్ర‌వ‌ర్తించాడు. ప్ర‌తిరోజూ తండ్రిని హింసిస్తోన్న ఓ వ్యక్తి తాజాగా పెగ్‌లోకి నీళ్లివ్వలేదన్న ఆగ్ర‌హంతో కన్నతండ్రినే చావ‌బాదాడు. దీంతో 75 ఏళ్ల ఆ వ్య‌క్తి అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ‌ ఘటన స్థానికులని షాక్‌కు గురిచేసింది. ఎంటీఎన్ఎల్ సంస్థలో లైన్‌మేన్‌గా పనిచేసి, రిటైర్ అయిన రామ్‌కుమార్(75) 'ఖుషీ రామ్ పార్క్‌'లోని ఓ ప్లాటులో ఉంటున్నాడు. అత‌డికి చెందిన మ‌రో ప్లాటులో రామ్ కుమార్ కొడుకు చేతన్ నివ‌సిస్తున్నాడు. రామ్‌కుమార్‌కి భార్య చనిపోగా, చేతన్‌ని అతడి భార్య విడిచిపెట్టి వెళ్లింది. అప్ప‌టి నుంచి చేతన్ త‌న‌ తండ్రికి చెందిన ఫ్లాట్‌లోనే తన 14 ఏళ్ల కూతురితో కలిసి నివసిస్తున్నాడు.

ఈ నేప‌థ్యంలోనే రెండు రోజుల క్రితం ప్లాటులో తాగడం మొద‌లుపెట్టిన చేత‌న్ త‌న తండ్రిని చంపేశాడు. ఆ ప్లాటులో నుంచి వ‌చ్చిన అరుపుల‌ని విన్న స్థానికులు తండ్రీకొడుకులు ఎప్ప‌టిలాగే మ‌రోసారి గొడ‌వ‌ప‌డుతున్నార‌ని అనుకున్నారు. అయితే, తన తాత‌య్య‌ను తండ్రి కొడుతున్న దారుణాన్ని చూసి తట్టుకోలేకపోయిన చేత‌న్‌ కూతురు ఇంట్లోంచి బయటికి పరుగులు తీయ‌డంతో స్థానికులంతా గూమిగూడి విష‌యాన్ని తెలుసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు చేత‌న్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. ఈ కేసులో 14 ఏళ్ల చేత‌న్ కూతురే సాక్షిగా ఉండ‌నుంది.

  • Loading...

More Telugu News